Tuesday, 28 July 2026 09:43:38 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ములుగు జిల్లా పేరు మార్పుకు కసరత్తు...

Date : 03 July 2024 07:06 AM

Telugu Rekha Media - తెలంగాణ / ములుగు : ములుగు జిల్లా పేరు మార్పుకు కసరత్తు మొదలైంది. ఆ జిల్లాను సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా పేరు మారుస్తూ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. జిల్లాల విభజన సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి అనేక పోరాటాల ఫలితంగా ములుగు జిల్లా ఏర్పడింది. 9 మండలాలతో కూడిన ఈ అడవుల జిల్లా ఓ చారిత్రక జిల్లాగా ఏర్పడింది. ఆరంభం నుండి ఈ జిల్లాను సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా ఏర్పాటు చేయాలని అనేక వినతులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. కానీ పేరు మార్పు ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు.తాజాగా ములుగు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క ఒక అడుగు ముందుకు వేశారు. ములుగును సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా పేరు మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మంత్రి చొరవ ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ దినకర్ పేరు మార్పుకు చర్యలు మొదలు పెట్టారు. సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా పేరు మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 3వ తేదీ బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలలో వారి అభ్యంతరాలు, సూచనలు తెలియపర్చవచ్చని సూచించారు. హిందీ, ఇంగ్లీష్ తెలుగు మూడు భాషలలో వారి అభ్యంతరాలు తెలియపరచాలని సూచించారు. గ్రామసభ అనంతరం ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. గెజిట్‎లో ములుగుకు జిల్లా సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా ఆమోదముద్ర లభిస్తుంది. మేడారం సమ్మక్క సారక్క దేవతలు కొలువుదిరిన ఈ జిల్లాలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది. యూనేస్కో గుర్తింపుపొందిన రామప్ప దేవాలయం కూడా ఈ జిల్లాలోనే ఉంది. సమ్మక్క సారక్క దేవతల పేరు చెప్పగానే ములుగు జిల్లా గుర్తుకొస్తుంది. కాబట్టి సమ్మక్క సారక్క ములుగు జిల్లాగా ఈ జిల్లా పేరును మార్చాలని స్థానిక ప్రజలు అనేకమార్లు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక మంత్రి సీతక్క చొరవతో ఎట్టకేలకు ఆ కల నెరవేరబోతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: