Wednesday, 29 July 2026 09:51:49 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ట్రాఫిక్ నియమాలు పాటించక పోవడం వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు...

-- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

Date : 01 August 2024 12:49 AM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్లే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆన్నారు..బుధవారం జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ లో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని పోలీస్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు కుడా భాగస్వామ్యం అయితేనే ప్రమాదాలను పూర్తిగా నివారించగలమని అన్నారు. జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో హెల్మెట్ ఆవశ్యకత, సీట్ బెల్ట్ ధరించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ,డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ చేయడం,లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయడం వీటి పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో ని ప్రారంభించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ విభాగం పరిశీలించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు పై ఈ విభాగం అధికారులు నివేధిక అందజేస్తారని అన్నారు. జిల్లా లో ఉన్న 44 బ్లాక్ స్పాట్స్(ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) ను పంచాయతీ రాజ్ మరియు ఆర్ అండ్ బీ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారిస్తునామని అన్నారు. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో వీలైనంతవరకు తక్కువ వేగంతో వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ లను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘు చందర్,టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్ , ఎస్.ఐ లు తిరుపతి, సుదీర్ రావు,ట్రాఫిక్ ఎస్.ఐ లు రామచంద్రం,మల్లేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: