Thursday, 29 October 2026 07:45:35 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ముదిరాజ్ లను బీసీ- ఏ లో చేర్చాలి...

Date : 15 July 2024 01:37 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : ముదిరాజ్ లను బీసీ డి నుండి బీసీ- ఏ లో చేర్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అద్యక్షుడు బల్ల సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మత్స్య సహకార సంఘం రాష్ట్ర ఛైర్మన్ పదవి ముదిరాజ్ లకే ఇవ్వాలని అన్నారు. మత్స్యకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్య సహకార సంఘాల ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ. 1వెయ్యి కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. రాజకీయంగా పదవుల పంపకాల్లో ముదిరాజ్ లకు జనాభా ప్రాతిపదికన కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశం లో వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, రాగినేడు, చీకురాయి సొసైటీ అధ్యక్షులు గుర్రాల లింగయ్య, పిడుగు రవి, ముదిరాజ్ అధ్యయన వేదిక జిల్లా అద్యక్షుడు గరిగంటి నరసింహరాజు, తీగల ధర్మపురి, కందుల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :