Sunday, 01 March 2026 11:52:24 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైంది...

-- ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోంది -- సీఎం చంద్రబాబు.

Date : 17 June 2024 07:29 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి సమీక్షి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని, పోలవరం ప్రాజెక్టుని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొ్న్నారు.2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణాకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించామని చంద్రబాబు గుర్తుచేశారు. నాటి ఎన్డీయే-2 కేబినెట్‌ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయగలిగామని చంద్రబాబు ప్రస్తావించారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాల్లో ఉందని, 2005లో వైఎస్సార్‌ ప్రారంభించిన ప్రాజెక్టు పనులపై అప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని చెప్పారు. ఇక డ్యామ్ ఎత్తు 45.72 మీటర్ల డ్యాం ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును తగ్గించడానికి ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు. స్పిల్ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్ చేశామని, చైనాలో త్రీ గార్జియస్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ వాటర్ డిశ్ఛార్జి అవుతోందని పేర్కొన్నారు.

అలాంటోళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇలా ఉంటుంది.. రాజకీయాల్లో ఉండ తగని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఆయన రావడం తప్పు కాదు. క్షమించరాని నేరం. అప్పటి నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. వైసీపీ ప్రభుత్వం రావడమే రివర్స్ టెండరింగ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేశారు. 2020 వరదల్లో డయాఫ్రం వాల్ 35 శాతం పాడయ్యింది. రూ.480 కోట్లతో అత్యవసరంగా నిర్మిస్తే దానిని అలా చేశారు’’ అని వివరించారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :