Tuesday, 28 July 2026 08:50:16 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నాణ్యతగా మరుగుదొడ్లు, బాత్ రూం తదితర మరమ్మతులు చేపట్టాలి...

గురుకులంలో పిల్లల పూర్తి బాధ్యత సదరు ఉపాధ్యాయులది, సిబ్బందిదే. -- జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్

Date : 20 July 2024 11:00 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : డా. బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలై కోలుకుంటున్న నేపథ్యంలో సదరు డా. బి ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చేపడుతున్న బాత్ రూం లు, మరుగుదొడ్లు, ఎలక్ట్రికల్ తదితర మరమ్మత్తులు నాణ్యతగా పూర్తి స్థాయిలో చేయాలని, విద్యార్థుల బాధ్యత ఇక మీదట గురుకుల పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయులది, సిబ్బందిదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని డా.బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చేపడుతున్న బాత్ రూంలు, మరుగు దొడ్ల తదితర మరమ్మతులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి వాటి ఫ్లోరింగ్ పూర్తి తొలగించి టైల్స్ ఏర్పాటు, తలుపులు, ఎలక్ట్రికల్ వర్క్స్, రన్నింగ్ వాటర్ తదితరాలను నాణ్యతగా పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయాలని సదరు పనులు చేపట్టిన ఇంజనీరింగ్ అధికారులను, మునిసిపల్ అధికారులను ఆదేశించారు. సదరు మరమ్మతులకు అంచనా విలువ సుమారు రూ. 56 లక్షలు కాగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, తాడేపల్లి వారు రూ.25 లక్షలు విడుదల చేశారని, మిగిలిన మొత్తాన్ని ఏర్పాటు చేయనున్నామని పనులు నాలుగు ఐదు రోజుల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల తల్లి తండ్రులు ఎంతో నమ్మకంగా గురుకుల పాఠశాలలో వారి పిల్లలను ఉంచడం వలన మన బాధ్యత ఎక్కువగా ఉంటుందని, వారిని మన సొంత పిల్లల్లా జాగ్రత్తగా చూసుకోవాలని, విద్యార్థుల పూర్తి బాధ్యత ఇక మీదట గురుకుల పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయులది, సిబ్బందిదని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఈఈ, ఏపీ ఈడబ్ల్యూఐడిసి బాలసుబ్రమణ్యం రెడ్డి, మునిసిపల్ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఎంపిడిఓ మాధవి లత ఎఈ కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: