Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : మండలం పరిధిలోనీ గల బొందిమడుగుల గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయం కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు ఎస్.ప్రతాప్ యాదవ్ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది సమక్షంలో శుక్రవారం రోజున ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా గౌరవ సర్పంచ్ సలహాదారులు ఎస్.ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ బొందిమడుగుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పలు గ్రామాలలోని ప్రజలు సచివాలయంలోని ఆధార్ సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు.ఆధార్ నమోదు కేంద్రం ద్వారా ఆధార్ కార్డులోని గల సరి చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రామాంజినేయులు,హుసేన్, లక్ష్మి,నారాయణ,సుబ్బరాయుడు, సుదర్శన్,నడిపి హుసేన్,దుబ్బ కాశిం, వడ్డే వెంకటేష్,నేసే నాగేష్,మహమ్మద్, వడ్డే పులికొండ మరియు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media