Thursday, 30 July 2026 01:04:17 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం

-- కమిషనర్ అదితిసింగ్

Date : 04 July 2024 10:06 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : అల్లూరి సీతారామరాజు జీవితం అందరికి ఆదర్శ ప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అల్లూరి చిత్రపటానికి పూలమాలతో అలంకరించి, అధికారులు, కార్పొరేటర్లు కొబ్బరి కాయలు కొట్టి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ మాట్లాడుతూ మన్యం ప్రజల స్వాతంత్ర్య కోసం బ్రిటీష్ వారిపై పోరాడిన అల్లూరి స్పూర్తిని అందరూ గుర్తుంచుకున్నారని, స్వాతంత్ర్య కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్పొరేషన్ ఉధ్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతిని మనమంతా స్మరించుకోవడం సంతోషమని, ఈ సందర్భంగా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ అల్లూరి సీతారామరాజు విగ్రహం తిరుపతి నగరంలో లేదని, ఆయన విగ్రహం ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆర్.సి.మునికృష్ణ, కోటూరి ఆంజినేయులు, వరికుంట్ల నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, రెవెన్యూ ఆఫిసర్లు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: