Tuesday, 28 July 2026 08:03:13 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిజాయితీ చాటుకున్న విజిలెన్స్ సిబ్బంది...

Date : 27 June 2024 09:32 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విజిలెన్స్ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు.పర్సు పోగొట్టుకొని ఆందోళనలో ఉన్న భక్తులకు పర్సును అందజేసి ఊరటను కలిగించారు. వివరాల్లోకెళితే కర్ణాటక రాష్ట్రం ములభాగల్ కి చెందిన జమున తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం ప్రసాదం అందజేసే క్యూలైన్లో ఆమె మనీ పర్స్ పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన భక్తులు ఆందోళనకు లోనయ్యారు.ఈ నేపద్యంలో క్యూ లైన్ లో దొరికిన పర్సును విజిలెన్స్ అధికారులు ఆలయ సూపరింటెండెంట్ మధు దృష్టికి తీసుకొచ్చారు. పర్సులోని గుర్తింపు కార్డు ఆధారంగా మైక్ సెట్ ద్వారా అనౌన్స్మెంట్ చేయగా భక్తులు సూపరింటెండెంట్ కార్యాలయం చేరుకున్నారు. పర్సులోని రూ 28,000,విలువైన బ్యాంక్ క్రెడిట్ కార్డులు,డెబిట్ కార్డులు, కొన్ని పత్రాలు భక్తురాలు జమున కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు అందజేశారు. ఆలయ సిబ్బంది అధికారులు నిజాయితీకి భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. విజిలెన్స్ ఏఎస్ ఐ బ్రహ్మానందం రాజు, సూపరింటెండెంట్ మధు, విజిలెన్స్ సిబ్బందిని ఆలయ డిప్యూటీవో గోవింద రాజన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అభినందించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: