Monday, 14 September 2026 04:46:28 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మెగాస్టార్.. పవర్ స్టార్.. మధ్యలో మోడీ..

Date : 12 June 2024 03:36 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : అమరావతి, విజయవాడ ( తెలుగు రేఖ న్యూస్): కోన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన.. కార్యక్రమమం మొత్తంలో హైలెట్‌గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు.ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత సభా వేదికనుంచి మోదీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్.. ఉండగా మధ్యలో మోదీ నిల్చుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగస్టార్.. పవర్ స్టార్ నినాదాలు చేశారు. అంతేకాదు మెగస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి పవన్ గడ్డం పట్టుకుని నవ్వుతూ పలకరించారు. దీనిని మెగస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే దృశ్యంగా చెప్పుకోవచ్చు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :