Tuesday, 28 July 2026 08:07:55 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశ భక్తి భావన పెంపొందుతుంది...

-- మున్సిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య. మన దేశంలో యువత దేశ భక్తి భావన పెంపొందించుకోవాలి -- ఎస్పి సుబ్బరాయుడు.

Date : 14 August 2024 10:21 AM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / తిరుపతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం వరకు టూరిజం మరియు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తిరుపతి నగరపాలక కమీషనర్ నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎస్పీ సుబ్బ రాయుడు, సంబంధిత అధికారులతో కలసి పాల్గొన్నారు.తిరుపతి నగరపాలక కమీషనర్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వాహణకు ముందు మన జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవనాల పైన మాత్రమే ఎగురవేసేవారమని స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తీ చేసుకున్న నేపథ్యంలో గౌ.ప్రధాన మంత్రి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని, ర్యాలీలు, పోటీలు, మారథాన్ లు వంటివి జరిపి తద్వారా ప్రజలలో అవగాహన దేశ భక్తి, ఐకమత్యం పెంపొందించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఎస్.పి. మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉందని ప్రతి ఒక్క యువత దేశ భక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో లక్ష్యాలను ఏర్పరుచుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు టూరిజం శాఖ అధికారి రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపెంద్రనాత్ రెడ్డి, ప్రొఫెసర్ రజనీ, విద్యార్థిని విద్యార్థులు, ఎన్సీసి క్యాడెట్లు, సంబందిత అధికారులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :