Tuesday, 28 July 2026 09:52:50 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఆళ్లగడ్డలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు...

ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలించినఫుడ్ ఇన్స్పెక్టర్ చికెన్ రొట్టె హోటళ్లకు నోటీసులు ఆహార భద్రత ప్రమాణాలు పాటించండి ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వెంకటరాము

Date : 06 August 2024 08:15 PM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / నంద్యాల/ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించి లైసెన్సులు లేనిపలు హోటల్ యాజమాన్యాలకునోటీసులు జారీ చేశారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలో పలు హోటళ్లపై తనిఖీలు నిర్వహించి ఆహార పరిరక్షణ నాణ్యత ప్రమాణాల లైసెన్స్ లో తీసుకొని హోటల్ యాజమాన్యాలపై నోటీసులు ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు కాసింవలిలు. ఆహార పదార్థాలపై కచ్చితంగా మూతలు ఉంచి పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలన్నారు.బ్రాండెడ్ పప్పు దినుసులు, మంచి నూనెలను మాత్రమే ఆహార పదార్థాల్లో వాడాలన్నారు. ప్రకృతి సిద్ధమైన రంగులే వాడాలి ఆహార పదార్థాల్లో టెస్టింగ్ సాల్ట్ వాడకూడదు రోజు వాడే ఉప్పునే వాడాలి కానీ ఈ నిబంధనలను బిరియాని సెంటర్లు, హోటల్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని అన్నారు. నిబంధనల ప్రకారం అన్ని రకాల భోజన శాలల్లో లోపలి భాగం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. డ్రైనేజీ వసతి బాగుండాలి .వంట ఉండే వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన హోటల్ యజమాని డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనంతరంబిరియాని సెంటర్లు, నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న చికెన్ రొట్టె గుడ్డు హోటళ్లపై తనిఖీలు నిర్వహించి ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆహార పదార్థాలలో రసాయన కలర్స్ వాడితే వారి లైసెన్స్ లో రద్దు చేసి వారి పైన కేసులు నమోదు చేస్తామన్నారు పలు హోటలలో ఆహారాన్ని శాంపిల్ గా తీసి ల్యాబ్ కు పంపిస్తామన్నారు . భోజన పదార్థాలు, టిపన్ల తయారీకి నాసిరకం సరుకులు కూరగాయలు వాడితే కఠిన చర్యలు మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రీజ్ లో ఉంచి మరుసటి రోజు విక్రయించరాదని హోటల్ యాజమాన్యాలకు సూచించారు. హోటల్ వ్యాపారాలు చేయాలంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తామన్నారు 5 లక్షల రూపాయలు ఉన్నాయని ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకట రాముడు, ఖాసిం వలి, ఫుడ్ సేఫ్టీసిబ్బంది తదితరులు ఉన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :