Saturday, 13 June 2026 12:28:01 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం ఒకరి అరెస్టు...

Date : 09 August 2024 11:09 AM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / తిరుపతి : అన్నమయ్య సానిపాయ అటవీ ప్రాంతంలో 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు పోలీసులు, ఒక తమిళ స్మగ్లర్ ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు ఆర్ఎస్ఐ వై విశ్వనాథ్ గురువారం సానిపాయ బేస్ క్యాంపు నుంచి కూంబింగ్ కు వెళ్లారు. వీరు గుర్రపుబాట వైపు ఉన్న వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. రాజంపేట వీరబల్లి ఫారెస్టు బీటు పరిధిలో మాదిరెడ్డి గారి పల్లి సమీపంలో కొంతమంది వ్యక్తులు దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, టాస్క్ ఫోర్స్ పోలీసులను గమనించి దుంగలను పడేసి చెట్ల పొదల మధ్య పారిపోయారు. అయితే ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు. అతనిని తమిళనాడు, తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకాకు చెందిన దొరైస్వామి (47)గా గుర్తించారు. ఆ ప్రాంతంలో పడిఉన్న 18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తితో పాటు దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ జీ. శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :