Tuesday, 28 July 2026 08:11:47 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత...

Date : 06 August 2024 10:30 AM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / సిద్ధిపేట : గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి అన్నారు. ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలలో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం మొదటి రోజు మర్కుకు మండలం పాములపర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి పచ్చదనం పరిశుభ్రత పై నినాదాలు చేస్తూ గ్రామం మొత్తం తిరిగి పల్లె ప్రకృతి వనంలో విద్యార్థులు, గ్రామ ప్రజలనుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పచ్చదనం-పరిశుభ్రత ప్రజలు అందరి బాధ్యత అని, స్వచ్ఛదనం-పచ్చదనం అనే కార్యక్రమం ద్వారా పరిశుభ్రత మరియు పచ్చదనం వలన కలిగే లాభాలను ప్రజలకు తెలియచెప్పి ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు మొక్కలు నాటి సంరక్షించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిది అని చెత్తను ఏరివేయడానికి గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్స్ తో పాటు ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్తను సేకరించి సెక్రిగేషన్ షెడ్లలో వేరుచేసి వర్మి కంపోస్టు తయారుచేసి రైతులకు అందించడం జరుగుతుందని అన్నారు. తద్వారా వ్యాధులు కూడా ప్రభలే అవకాశాన్ని నిరోధించగలుగుతాము అన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. మిషన్ భగీరథ పైపుల ద్వారా శుద్ధమైన త్రాగునీటినీ సరఫరా చేస్తున్నామని ప్రజలు వాటిని తాగాలని అన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి, క్లోరినేషన్ చేస్తూ అధికారులు నీరు కలుసితం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. త్రాగునీటి కలుషితం వలన డయేరియా లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని అన్నారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులకు కారణం వస్తుంది కాబట్టి నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, ఫ్రైడే నాడు డ్రైడే నిర్వహించి నిలువ నీటిని పారబోయాలని ఉన్నారు. పల్లె ప్రకృతి వనంలో 5 నిమిషాలు తిరిగితే అడివిలో తిరిగిన ఫీలింగ్ వచ్చిందని చెట్ల వలన ఎంతో చల్లగా ఉందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. గ్రామం నర్సరీలో కావలసినన్ని ముక్కలు అందుబాటులో ఉన్నాయని స్కూల్స్ ఇతర ప్రభుత్వ సంస్థలు, రోడ్లకు ఇరువైపులా మరియు కమ్యూనిటీ ప్లాంట్లను దాంతోపాటు ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలను నాటాలని అన్నారు. పాఠశాల విద్యార్థులు ఏదేని బర్త్డే లేదా ఇతర అకేషన్లలో ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి సంరక్షిస్తే మీరు స్కూల్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు పెరిగి పెద్దగైతాయని అన్నారు. స్వచ్ఛ దనం పచ్చదనం కార్యక్రమం పైన పాఠశాలలో నిర్వహించే ఉపన్యాసం, వకృత్వం పోటీల్లో అందరూ పాల్గొనాలి. అదేవిధంగా క్రీడా స్ఫూర్తితో పచ్చదనం స్వచ్ఛతనం కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఈ స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అఫ్జల్, ఏపిఎమ్ బ్రహ్మచారి, పంచాయతీ సెక్రెటరీ, పాఠశాల హెచ్, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :