Saturday, 13 June 2026 12:50:32 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పై చర్చ..

Date : 29 July 2024 09:32 PM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఛత్తీస్‌ గఢ్, యాదాద్రి, భద్రాద్రి ఒప్పందాలపై విచారణ చేయాలని బీఆర్ఎస్ నేతలే అడిగారని, అందుకే విచారణ కమిషన్‌ను నియమిం చామని తెలిపారు.కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారని చెప్పారు.విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు.విచారణ కొనసాగించా ల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ కొత్త కమిషన్ చైర్మన్ ను నియ మించాలని ఆదేశించిందని అన్నారు. కొత్త చైర్మన్ ను సోమవారం నియమిస్తామని చెప్పారు.తెలంగాణకు బీఆర్ఎస్ నేతలే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతు న్నారని తెలిపారు. వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ దక్కిందని చెప్పారు.ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు, సంబంధిత ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉంద ని తెలిపారు.కానీ, ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారని చెప్పారు.రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణ కు ఇప్పించారని తెలిపారు. 53.46శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యు త్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని, తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారని అన్నారు.సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే అన్నట్లు విద్యుత్ ఒప్పందాల విష యంలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ఇంకెన్నాళ్లు ఈ ఊదరగొట్టు మాటలు అని నిలదీశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :