Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించాలని ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయొద్దని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రజాభవన్‌లో బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీ దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు.రూ.2లక్షల రుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి రూ.31వేల కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు. ఆగస్టు నెల దాటకముందే రుణమాఫీ కింద రూ.31వేల కోట్ల నిధులను విడుదల చేస్తాం.గురువారం సాయంత్రం 4 గంటలకు 11 లక్షలకు పైగా రైతులకు రూ.6వేల కోట్లు విడుదల చేసాము, ఈ నెలలలోనే రెండో దఫా రూ.లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతులకు,ఆ తర్వాత రూ.2లక్షల వరకు రుణాలకు నిధులు విడుదల చేస్తాం.రూ.2 లక్షలకు పైబడి రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకోవాలి. ప్రభుత్వం మంజూరు చేసే రూ.2లక్షలు కలిపి మొత్తంగా ఏ రైతూ రుణ బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Reporter
Telugu Rekha Media