Thursday, 29 October 2026 06:43:29 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బడ్జెట్‌పై చర్చ సమాధానం ఒకే రోజులో పూర్తి కావాలనడం సరికాదు, తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష గట్టింది

-- బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు.

Date : 23 July 2024 11:53 PM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : బడ్జెట్‌పై చర్చ సమాధానం ఒకే రోజులో పూర్తి కావాలనడం సరికాదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. బడ్జెట్‌పై చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శలు గుప్పించారు. బడ్జెట్ చర్చను నాలుగు రోజులకు కుదించారని, కనీసం 15 రోజులు బడ్జెట్ సమావేశాలు జరపాలని బిఎసిలో డిమాండ్ చేశామన్నారు. బిఎసి సమావేశం అనంతరం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష గట్టిందని, రేపు నిరుద్యోగుల సమస్యలపై చర్చ పెట్టాలని ప్రతిపాధించామని, లక్షలాది నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రధాని ప్రతిపక్షంగా నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.మరో ఎనిమిది సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చామని, శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో భయానక వాతావరణం ఏర్పడిందని, చేనేత రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి చర్చ జరపాలని, బాండ్ పేపర్లు, ఆరు గ్యారంటీలపై చర్చించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీలో ఆంక్షలు పెట్టి రైతుల్ని ఇబ్బంది పెడతున్నారని, డిసెంబర్ 9 తరువాత ఉన్న వడ్డీ రైతులే కట్టాలని చెప్పడం సరికాదని, పంటలకు బోనస్, రైతు భరోసాపై చర్చ జరగాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి నిధులు ఎందుకు ఎత్తేశారని అడిగారు. స్థానిక సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రజారోగ్యం దెబ్బతింటోందని, ఎనిమిది నెలలుగా ఒక్క రూపాయి కూడా పీజు రీయింబర్స్ ఇవ్వలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :