Tuesday, 28 July 2026 09:41:35 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై గవర్నర్‌కు బిఆర్‌ఎస్ వినతిపత్రం...

Date : 20 July 2024 11:17 PM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌ఎ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కెటిఆర్ ఆధ్వరంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్ ను కలిశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని, గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని, అక్రమంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు.ఎంఎల్‌ఎలను చేర్చుకోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ఫిరాయింపుపై న్యాయ ప్రక్రియ నడుస్తుందని గవర్నర్‌కు తెలిపామన్నారు. వెంటనే గవర్నర్ స్పందించి, ఫిరాయింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారన్నారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అయ్యిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేశారని, ఇప్పుడు వరదలాగ నీళ్లు వస్తున్న మేడిగడ్డ తట్టుకోవటమంటే అదే కాళేశ్వరం గొప్పతనమని ప్రశంసించారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తామని ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారని, ఇప్పుడు నాలుగు వందల కోట్లు లాభాలు వస్తున్నాయా? అని ప్రశ్నించడంతో పాటు అందులో సిఎం వాటా ఎంత? అని అడిగారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: