Monday, 14 September 2026 03:42:09 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ ప్రారంభించింది...

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది. -- కెటిఆర్

Date : 10 July 2024 09:44 AM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ ప్రారంభించిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఆయారాం, గయారం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. మంగళవారం బిఆర్ఎస్ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుందని విమర్శించారు. గోవా, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శలు చేశారని, ఇప్పుడు తెలంగాణాలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ఎక్కువగా ప్రోత్సహించిందని, 2023 ఎన్నికల్లో కేవలం నాలుగు లక్షల ఓట్లతోనే అధికారం కోల్పోయామని కెటిఆర్ గుర్తు చేశారు. సిఎం, డిప్యూటీ సిఎం సంతకాలతో ఆరు గ్యారంటీల పత్రాన్ని తయారు చేశారని, ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని కెటిఆర్ అడిగారు. ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందని, మా వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బిఆర్‌ఎస్ ఓడిపోవడం ప్రజల తప్పు అనడం మా తప్పే అవుతుందన్నారు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడంతోనే ఓడిపోయామనడానికి కారణాలు కనిపించడంలేదన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :