Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / సూర్యాపేట్ : సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థిని సరస్వతి అనుమానస్పద మృతి చెందింది. జ్వరం వచ్చిందని సమాచారం హాస్టల్ సిబ్బంది ఇచ్చారు. నూతనకల్ మండలం మాచన పల్లి గ్రామానికి చెందిన సోమయ్య నవ్య దంపతుల కూతురు సరస్వతి మృతి చెందింది. సరస్వతి బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది. మంగళవారం ఉదయం తీవ్రమైన జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించామని, ఆ లోపే చనిపోయింది అని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Admin
Telugu Rekha Media