Saturday, 13 June 2026 02:01:51 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

దళిత యువతి పై పట్టపగలు ప్రియుడి తండ్రి కత్తితో దాడి...

అపస్మార్క స్థితిలో యువతి - గాజువాక లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన స్థానికులు - ప్రేమ వ్యవహారమే దాడికి కారణం.

Date : 25 June 2024 08:06 PM

Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / అనకాపల్లి : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామంలో ఓ దళిత యువతపై పట్టపగలు కత్తితో దాడి జరిగింది. గొంతు కొడవలితో కోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన యువతి. హుటాహుటిన గాజువాక లోని ఓ ప్రైవేట్ ఆసుత్రికి స్థానికలు తరలించరు. 50 కుట్లు పడడంతో ప్రాణపాస్థితిలో యువతి కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటన సంబంధించి స్థానికులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సాయి నగర్ కాలనీకి చెందిన యశోద (31) ఇదే గ్రామానికి చెందిన రమేష్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో రమేష్ తల్లిదడ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో యశోద మూడు నెలల క్రితం పరవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో రమేష్ యశోదను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినప్పటికీ రమేష్ తండ్రి ఒప్పుకోకపోవడంతో వివాహం వాయిదా పడింది. ఇప్పుడు యశోద గర్భిణీ కావడంతో మరోసారి పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రమేష్ తండ్రి కంపర సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో యశోద దేశపత్రినిపాలెం చెక్ పోస్ట్ దగ్గర గొడవ పెట్టుకొని ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. రమేష్ సోదరి భారతి ఆమె భర్త నర్సింగరావు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన యశోదను గాజువాక లోని ఆర్కే ఆసుపత్రికి ప్రియుడు రమేష్ మరి కొంతమంది స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ విషయంలో పోలీసు వ్యవహార శైలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఫిర్యాది ఇచ్చిన దళిత యువతకి సకాలంలో న్యాయం చేయకపోగా రక్షణ కల్పించలేకపోయారని విమర్శిస్తున్నారు. పోలీసుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈ దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :