Saturday, 13 June 2026 12:52:18 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారికి సర్ప్రైజ్ ఇచ్చిన హీరో అడివి శేష్...

Date : 20 July 2024 10:54 PM

Telugu Rekha Media - కథనాలు / హైదరాబాద్ : హీరో అడివి శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటారు. మంచి మనసుతో స్పందించడంలో ఎప్పుడూ ముందుండే శేష్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ చిన్ని అభిమాని గురించి తెలుసుకున్న శేష్, త్వరగా ఆమె, కుటుంబ సభ్యులని సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. చిన్నారి కోసం ఒక క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఒక హోటల్‌లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలసి సర్ప్రైజ్ చేశారు. పాపతో రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు. చిన్నిపాప, ఆమె కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటున్న శేష్, అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని మళ్లీ కలుసుకున్నారు. శేష్‌కి డై -హార్డ్ ఫ్యాన్ అయిన ఆ చిన్నారి తన అభిమాన హీరోని కలవాలని చాలా కాలంగా కలలుకంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న శేష్, ఆమె కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. స్క్రీన్ మీదే కాదు, అఫ్ స్క్రీన్ లోనూ లార్జర్ దెన్ లైఫ్ హీరోగా తన గొప్ప మనసుని చాటారు శేష్.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :