Tuesday, 28 July 2026 07:45:15 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

గుడిలో దెయ్యం...

Date : 15 July 2024 02:10 PM

Telugu Rekha Media - కథనాలు / కరీంనగర్ : గుడిలో ఏముంటుంది..? అంటే దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ, ఇక్కడ గుడిలో మాత్రం ఏముంటుందో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ఆ అంధవిశ్వాసమే.. ఇప్పుడా గుడికి ఎవ్వరినీ వెళ్ళకుండా చేస్తుంది. మరి భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్లో ఏం జరిగింది..? అదంతా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగుపెడితే కాళ్లు, చేతులు వణుకుతాయి. గుడి గంట మోగినా గుండె దడ పెరుగుతుంది. అరుపులు.. కేకలు.. పూనకంతో ఊగిపోయే జనాలు, వామ్మో.. ఒకటేమిటీ ఇంకా చాలానే కనిపిస్తాయి. ఆ ఆలయం ఎక్కడో లేదు మన తెలంగాణలోనే ఉంది.ఇదిగో మనం చూస్తున్న ఈ గుడి వాస్తవానికి వేణుగోపాలస్వామి ఆలయం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో ఉన్న ఈ ఆలయ చరిత్ర 150 ఏళ్ల కిందిది. అయితే గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ సరిగ్గా ఇక్కడి దేవుడు పూజలకు నోచుకోవడం లేదు. గుడిలో చాలా సంవత్సరాలు పనిచేసిన పూజారి మరణంతో ఈ గుళ్లో దేవుడు కాక ఏదో అదృశ్య శక్తి‌ ఉన్నట్టు ప్రచారం జరగడంతో జనం ఈ గుడికి రావడానికే బెంబేలెత్తిపోతున్నారు.15 ఏళ్ల క్రితం హనుమంతు అనారోగ్యంతో మరణించడంతో ఇప్పుడు గుడి మూగబోయింది. అప్పటివరకు పెద్దఎత్తున భక్తులు, మానసిక రోగులు, వికలాంగులతో ఎప్పుడూ కళకళలాడిన గుళ్లో.. ఇప్పుడు భూత, ప్రేత, పిశాచాలు అవహించిందని స్థానికుల్లో భావన నెలకొంది. ఈ అపవాదు కూడా నాలుగు దిక్కులా పాకింది. ఇప్పుడు రాత్రి వేళ ఇక్కడికి స్థానికులు కన్నెత్తి చూడకపోగా.. పట్టపగలు సైతం ఇక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారు.ప్రస్తుతం కరీంనగర్ శివార్లలోని తీగలగుట్టపల్లికి చెందిన ఓ పూజారి రెండు, మూడు నెలలకో సారి ఈ గుడికి వచ్చి దీపం పెడుతూ పోతుండగా.. మిగిలిన జనం మాత్రం ఆర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయానికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం దూప, దీప నైవేద్యాలూ చూస్తున్న పూజారి ఆరోగ్యం కూడా క్షీణించడంతో.. దేవుడున్న ఈ గుడి దెయ్యం పట్టిన ఓ బూత్ బంగ్లాలా స్థానికుల్లో ఒకింత ఆందోళన రేకెత్తిస్తూ భయపెడుతోంది. రాక్షసులను చీల్చీ చెండాడిన కాళికామాతతో పాటు.. అన్ని భయాలకు దీటైన అభయాంజనేయుడు కొలువై ఉన్నా ఈ గుళ్లోకి వెళ్లేందుకు ఇప్పుడు జనం జంకుతున్నారు.ఓ వైపు ప్రపంచం టెక్నాలజీ వైపు అడుగులేస్తూ ఉంటే.. ఇదిగో దేవుడున్న గుళ్లో దెయ్యం ఉందనుకుంటూ జనం ఇంకా భయపడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి జనవిజ్ఞాన వేదిక సభ్యులేమైపోయారో.. గుళ్లో దెయ్యమన్నన భయంతో భక్తజనం బంద్ అయితే నచ్చజెప్పాల్సిన పండితులేమయ్యారో తెలియడం లేదు. ఏదీ ఏమైనా గుళ్లో దెయ్యమన్న పేరుతో ఆర్నకొండ వేణుగోపాలస్వామి ఆలయం పాడుబడిపోవడం విచారకరం.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :