Sunday, 01 March 2026 10:11:10 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

రైతులకి పీఎం తీపి కబురు...

-- బ్యాంకు ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బు ఎప్పుడంటే..?

Date : 14 June 2024 09:05 PM

Telugu Rekha Media - వ్యవసాయం / : ఢిల్లీ, (తెలుగు రేఖ న్యూస్): దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ సర్కార్ పెద్ద శుభవార్త చెప్పింది. ఈ సారి ముందుగా ప్రధాని తన ప్రస్థానాన్ని రైతులకు మేలు చేసే కార్యక్రమం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత సొమ్ము జమ కోసం నిరీక్షణకు తెరపడనుంది. కేంద్రంలో ఎన్‌డీఎ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రైతుల కోసం తదుపరి విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని మంజూరు చేసే ఫైలుపై సంతకం చేశారు. దీంతో కోట్ల మంది రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. తాజాగా వారి ఖాతాల్లో డబ్బు జమకు సంబంధించిన తేదీ వివరాలు వెలువడ్డాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 18. 2024 న మొత్తం దాత ఖాతాలో జమ చేయబడుతుందని సమాచారం. ప్రధాని మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటిస్తుండగా. అక్కడి నుంచి డిబిటి, ద్వారా దేశంలోని 9.3 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 20,000 కోట్లు బదిలీని పరిశీలిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి పీఎం కిసాన్ యోజన అనేది పేద రైతుల సంక్షేమం కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన స్కీమ్. రైతు బంధు పేరుతో తెలంగాణలో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని దేశవ్యాప్తంగా రైతులకోసం మోదీ విస్తరించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :